కడప నుంచి దుబాయ్ విమాన సర్వీస్ ప్రచారం అవాస్తవం

రిపోర్టర్: సునీల్ స్థలం: కడప

కడప నుంచి దుబాయ్‌కు ఈ నెల 23 నుంచి ఇండిగో డైరెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కడప విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దార్ స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంత వాసుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, ప్రయాణికులు మోసపోవద్దని ఆయన హెచ్చరించారు.