అమెరికా తెలుగు సంఘంతో ఐఐటీ హైదరాబాద్ చరిత్రాత్మక భాగస్వామ్యం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
అమెరికా తెలుగు సంఘం ఐఐటీ హైదరాబాద్ సంస్థతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆటా నిర్వాహకులు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, టెక్నాలజీ పార్కులో పరిశోధనలు, స్టార్టప్లకు మెంటార్షిప్ వంటి గొప్ప అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు నిర్దేశిత లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యా సంబంధిత వేదిక ద్వారా అమెరికా, భారతదేశంలోని ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్లు పొందడానికి చక్కటి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.