వైభవంగా సాగిన తుమ్మలగుంట శ్రీవారి వార్షిక వసంతోత్సవ వేడుకలు

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేవదేవుని సన్నిధిలో సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటిని చల్లుకుంటూ భక్తులు సందడి చేశారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు వసంతోత్సవాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ఆలయం వద్ద వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల గాత్ర కచేరీ ఆకట్టుకుంది.