వీఓఏల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి: సిఐటియు డిమాండ్
రిపోర్టర్: రాము
స్థలం: నల్గొండ
గుర్రంపోడు మండలంలో వీఓఏలకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 78 మంది వీఓఏల వేతనాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు వచ్చే వరకు పోరాటం ఉధృతం చేస్తామని, ఏపీఎం, సీసీలను వెంటనే బదిలీ చేయాలని హెచ్చరించారు.