ఫుట్బాల్ సంచలనం: కొత్త సెలబ్రేషన్ తో క్రిస్టియానో రోనాల్డో భారీ సంకేతాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Riyadh
అల్ నాసర్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో మైదానంలో చేస్తున్న కొత్త సెలబ్రేషన్ అభిమానుల్ లో తీవ్ర చర్చకు దారితీసిందని క్రీడా నిపుణులు వెల్లడించారు. గోల్ కొట్టిన ప్రతిసారీ ఆయన వేళ్లతో ఎం ఆకారంలో విభిన్నమైన భంగిమ ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. రోమన్ సంఖ్యలలో వెయ్యిని సూచించేందుకు ఈ సంకేతం వాడుతున్నారని, కెరీర్ లో మరో పదిహేను గోల్స్ చేస్తే ఆ మైలురాయి అందుకోవడం ఖాయమని వారు స్పష్టం చేశారు.