వివేకా హత్య కేసులో ఈడీ ఉచ్చు: ఎంపీ అవినాష్‌రెడ్డికి విచారణ నోటీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Kadapa
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఈడీ తాజాగా విచారణ నోటీసులు జారీ చేసింది. ఈ నెల పద్నాలుగో తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. హత్య కేసులో నలభై కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు, సుపారీ డీల్‌పై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.