హింసకు సినిమాలను ఆపాదించడంపై స్పందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనంతపురం
సినిమాల్ లోని హింసపై వస్తున్న విమర్శలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. హింసాత్మక ఘటనలకు చిత్రాలను బాధ్యులను చేయడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్ లకు రామాయణాన్ని బాధ్యుడిని చేసినట్లే ఇదంటూ ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పాఠశాల దాడి నేపథ్యంలో సినిమాల్ లో హింసపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.