స్వార్థాన్ని వీడి నిజాయితీని చాటిన తిరుపతి క్యాషియర్

రిపోర్టర్: praveen kumar స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతి నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్న మహిళ అపారమైన నిజాయితీని చాటుకున్నారు. హోటల్లో భక్తులు మరిచిపోయిన సుమారు 45 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్ను ఆమె భద్రపరిచారు. ఎలాంటి దురాశకు లోనుకాకుండా తక్షణమే పోలీసులకు సమాచారం అందించి అసలైన యజమానులకు అప్పగించారు. ఈ గొప్ప నిర్ణయంతో మానవ విలువలు ఇంకా బతికే ఉన్నాయని నిరూపించిన ఆమెను పోలీస్ అధికారులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.