ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం: విచారణకు రంగంలోకి దిగిన షిన్ బెట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Dubai

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన కో పైలట్ హమమ్ అల్ హమ్మామిని విచారించేందుకు ఇజ్రాయెల్ భద్రతా సంస్థ షిన్ బెట్ అధికారులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు పంపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై యుఎఇ అధికారుల విచారణలో నిందితుడు గాజాపై ప్రతీకారంగానే ఈ ఉగ్రదాడికి తెగబడినట్లు అంగీకరించినట్లు స్పష్టమైంది.