తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారంతో తీవ్ర భయాందోళనలో ప్రజలు

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి జిల్లా

తిరుపతి జిల్లా శేషాచలం అటవీ సరిహద్దు తుమ్మసేనపల్లి పరిసరాల్లో ఏనుగుల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన వారం రోజులుగా రాత్రి వేళల్లో గ్రామ సమీపానికి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయని, అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరిమి తమను కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.