ప్రయాణికులకు తీపి కబురు: దూర ప్రాంతాల ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలు తగ్గింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ప్రైవేట్ ట్రావెల్స్ పోటీని తట్టుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందని రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, మైసూరు, విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లే బస్సుల్ లో టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బిహెచ్ఈఎల్ డిపో నుంచి నడిచే అప్ అండ్ డౌన్ బస్సులకు మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.