పోక్సో కేసులో టెలివిజన్ నటుడు రోహిత్ చండేల్‌కు బెయిల్ మంజూరు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మహారాష్ట్ర
టెలివిజన్ నటుడు రోహిత్ చండేల్‌కు ముంబై సెషన్స్ కోర్టు పోక్సో కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 16 ఏళ్ల బాలికపై వేధింపులు, దాడి ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. నేరం తీవ్రత దృష్ట్యా క్యాష్ బెయిల్ కోర్ట్ తిరస్కరించింది. బాధితురాలిని సంప్రదించరాదని, విచారణకు ప్రతిసారీ హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది.