నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం: సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని సీనియర్ నటుడు గౌతం రాజు స్పష్టం చేశారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటిస్తున్నానని వెల్లడించారు. నిర్ధారణ లేని తప్పుడు వార్తలు రాసి తన సన్నిహితులను ఆందోళనకు గురిచేయవద్దని మీడియాను గౌతం రాజు కోరారు.