సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దాసి చక్రధర్ నియామకం

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు రూరల్

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పుంజులూరుపాడు గ్రామానికి చెందిన సీనియర్ నేత దాసి చక్రధర్ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న తన కష్టాన్ని గుర్తించి ఈ పదవి కట్టబెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు, పార్టీ నాయకులకు చక్రధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.