సత్యనికేతన్ భవన కూల్చివేత ఘటన: ముగ్గురు ఎంసీడీ ఇంజనీర్లు సస్పెండ్
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
దిల్లీలోని సత్యనికేతన్ భవన కూల్చివేత ఘటనలో ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అనధికార కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు ఇంజనీర్లు, ఒక డిప్యూటీ కమిషనర్ సస్పెండయ్యారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.