రాంబిల్లి సెజ్‌లో నూతన ఐనాక్స్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి భరత్
రిపోర్టర్: నరేష్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి సెజ్ పరిధిలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు వందల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన నూతన ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ పరిశ్రమను రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రారంభించినట్లు సుందరపు విజయ్ కుమార్ అనకాపల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించి పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.