ఇండియన్ ఎఫ్ ఫోర్ రేసింగ్ రెండో రౌండ్ లో మొదటి స్థానంలో భువన్
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖకు చెందిన పదహారేళ్ల యువ రేసర్ భువన్ బోను ఇండియన్ ఫార్ములా-4 ఛాంపియన్‌షిప్‌లోని రెండో రౌండ్‌లో మొదటి స్థానాన్ని సాధించి సంచలనం సృష్టించారు. కోయంబత్తూరు వేదికగా జరిగిన ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఫార్ములా-1 లక్ష్య వైపు మరో అడుగు ముందుకెళ్లారు. తల్లిదండ్రులు భానుప్రసాద్, రాధికల ప్రోత్సాహంతో చదువును కొనసాగిస్తూనే రేసింగ్‌లో రాణిస్తున్న భువన్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన పిన్న వయసు రేసర్‌గా గుర్తింపు పొందారు.