కుప్పం పర్యటనలో రూ.600కు పైగా కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకున్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రమేష్
స్థలం: కుప్పం
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో రూ.11,360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. అలాగే పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ కంపెనీలతో రూ.600 కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీని ద్వారా సుమారు 10,515 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కుప్పం అభివృద్ధి కోసం రూపొందించిన మన రోవర్ యాప్‌ను ఆయన ప్రారంభించారు.