పులివెందులలో ఓటు వేయని జగన్: రీపోలింగ్ నిర్వహించాలంటూ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి

రిపోర్టర్: నరేష్ స్థలం: పులివెందుల

పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారని వైఎస్సార్ కడప జిల్లా వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్ లో తాను ఓటు వేస్తే ఎన్నికలు సజావుగా జరిగినట్లు భావిస్తారని ఆయన పేర్కొన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించిన ఆయన, తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వెల్లడించారు. రీపోలింగ్ ప్రకటిస్తేనే వచ్చి ఓటు వేస్తానని స్పష్టం చేశారు.