ముధోల్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశం

రిపోర్టర్: శివ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా ముధోల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు కలెక్టర్ కార్యాలయం వెల్లడించింది. పాఠశాలలో విద్యా బోధన తీరును, నిర్వహణను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్ లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యనందించాలని స్పష్టం చేశారు. అలాగే ముధోల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించి వైద్య సేవలు, మౌలిక వసతులను సమీక్షించారు.