తెలంగాణ జైళ్ల శాఖకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు దక్కడం గర్వకారణం

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో జైళ్ల శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కిందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, బాధితులకు పునరావాసం కల్పించడంలో చేస్తున్న సేవలకు గాను తెలంగాణ జైళ్ల శాఖకు 109వ స్కోచ్ అవార్డు లభించినట్లు తెలిపారు. డీ-అడిక్షన్ కేంద్రాల పనితీరు, ఖైదీల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న సంస్కరణలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం పట్ల శాఖలో ఉత్సాహం నెలకొందన్నారు.