తీవ్ర అలర్ట్: తుపాను ముప్పు నేపథ్యంలో అగ్నిమాపక శాఖ పూర్తి సన్నద్ధత
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అగ్నిమాపక శాఖ పూర్తిగా అప్రమత్తమైందని జిల్లా అగ్నిమాపక అధికారి వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. సహాయక చర్యల కోసం అన్ని రకాల రెస్క్యూ పరికరాలను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్ లో ప్రజలను రక్షించేందుకు పవర్ సా, రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. రహదారులపై చెట్లు విరిగిపడితే తొలగించేందుకు ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశామని అధికారులు స్పష్టం చేశారు.