ఏపీలో ఎల్నినో ప్రభావం, భగభగ మండుతున్న ఎండలు

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల కాలంలోనూ వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోత తీవ్రతరమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో డిస్కంలు అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తున్నాయి. భానుడి ప్రతాపం, కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.