'యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా': నందు కుటుంబంపై కేసు నమోదు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఇబ్రహీంపట్నం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రమా నందన అలియాస్ నందు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షలు టోకరా వేసినట్లు ముగ్గురిపై ఆరోపణలు వచ్చాయి. బాధితులు నందూస్ కిచెన్‌కు వచ్చి తమ డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.