పాలకొండలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పువు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎన్నికల అధికారులు సూచించారు. ప్రస్తుతం ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించకుండా ఎన్నికల అధికారులకు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.