వర్షపు నీటిలో మునిగిన ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల నిరసన

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం NSP క్యాంపులోని ప్రభుత్వ SC బాలుర వసతి గృహాల్లో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ, ప్రహరీ గోడలు లేక మోకాళ్ల లోతు నీరు నిలవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని AISF, AIYF ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. మురుగు నీటిని తొలగించి, డ్రైనేజీ, ప్రహరీ గోడ నిర్మించాలని నాయకులు డిమాండ్ చేశారు.