వైకాపా ఫ్యాక్షన్ రాజకీయాలపై తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మంగళగిరి

తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక ఫ్యాక్షనిస్టులా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. వ్యవస్థలను బెదిరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ జగన్ను ఆయన సూటిగా నిలదీశారు.