పెయింటింగ్ కార్మికులకు ఎమ్మెల్యే తీపి కబురు: స్థలంతో పాటు ఆర్థిక సాయం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి నియోజకవర్గ పెయింటింగ్ అండ్ పుట్టీ వర్కర్స్ యూనియన్ కార్యాలయ ఏర్పాటుకు త్వరలోనే స్థలం కేటాయించడంతో పాటు, రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ వెల్లడించారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఉపాధి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో గౌరవ అధ్యక్షుడు బండి ప్రభాకర్ కృషి చేశారన్నారు. కార్మికుల సంక్షేమానికి అంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కుల సాధనకు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.