ముఖ్య ఎన్నికల కమిషనర్ నివాసంపై దాడి ఘటనలో ఆరుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆగ్రా
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పూర్వీకుల నివాసాన్ని ముట్టడించి నిరసన తెలిపిన ఘటనలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాల తారుమారును నిరసిస్తూ సోమవారం చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆగ్రాలోని నివాసంపై నిరసనకారులు అసభ్యకర రాతలు రాశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు హరిపర్వత్ పోలీస్ స్టేషన్లో హత్యాప్రయత్నం, అల్లర్లు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.