విశాఖలో సీఎం చంద్రబాబుకు మురీ మిక్చర్ తినిపించిన మహిళ
రిపోర్టర్: రమేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురీ మిక్చర్ విక్రయించే అట్టాడ నాగమణి అనే మహిళ సీఎం వద్దకు వచ్చి తాను స్వయంగా తయారు చేసిన మురీ మిక్చర్‌ను అందించారు. ఆమె తయారు చేసిన మిక్చర్‌ను రుచి చూసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆమెను అభినందించారు.