తెదేపాలో తీవ్ర కలకలం: పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఇద్దరు నేతలు సస్పెండ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఇద్దరు నాయకులను తెదేపా నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రామభద్రపురం మండలానికి చెందిన సామంతుల ఉమామహేశ్వరరావుతో పాటు పూసపాటిరేగ మండలానికి చెందిన పసుపులేటి లలితకళపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు.