కేదార్‌నాథ్‌లో భారీ హిమపాతం: మంచు దుప్పటిలో మునిగిన పుణ్యక్షేత్రం
రిపోర్టర్: రాము
స్థలం: Rudraprayag
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో భారీ హిమపాతం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సీజన్లో ఇది రెండవసారని, ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పబడిపోయాయని తెలిపారు. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నప్పటికీ, శీతాకాలంలో ఆలయం మూసివేసేలోపు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారని, భద్రతా చర్యలపై యాత్రికులను అధికారులు అప్రమత్తం చేశారని తెలిపారు.