ముంబైలో షాకింగ్ ఘటన: టికెట్ అడిగిన మహిళా టీసీపై ప్రయాణికురాలి దాడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: Mumbai
ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ లో విధుల్ లో ఉన్న మహిళా టికెట్ కలెక్టర్ హర్ప్రీత్ కౌర్ కమత్ పై ఓ ప్రయాణికురాలు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళను జరిమానా చెల్లించాలని కోరడంతో ఆగ్రహం చెంది ఆమెపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.