అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఎదుట ప్రజాదరణ రేటింగ్ లపై ప్రశ్నల వర్షం
రిపోర్టర్: నరేష్
స్థలం: Washington
ప్రజాదరణ రేటింగ్ ల పతనానికి సంబంధించి ఎదురైన కఠినమైన ప్రశ్నలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందించారు. సర్వేలు ఎప్పుడూ కచ్చితంగా ఉండవని, తాను మాత్రం తన బాధ్యత నిర్వర్తించడంపైనే దృష్టి పెట్టానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయడం ద్వారా రాజకీయాలు వాటంతట అవే సరిదిద్దుకుంటాయని వాన్స్ పేర్కొంటూ మీడియాతో సంభాషణను మధ్యలోనే ముగించి అక్కడి నుండి వెళ్లిపోయారు.