మహాత్మ గాంధీ మార్గంతోనే సమసమాజ స్థాపన సాధ్యమన్న కేపీ వివేకానంద

రిపోర్టర్: రమేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మహాత్మ గాంధీ చూపిన శాంతి మరియు అహింస మార్గాల ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని బిఆర్ఎస్ ఎల్పీ విప్ అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడించారు. జాతిపిత ఆశయాలను అందరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. గాంధేయవాదంతోనే దేశంలో శాంతిభద్రతలు, సమానత్వం పరిఢవిల్లుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.