అనంతపురంలో షాకింగ్ ఘటన: చౌడేశ్వరి దేవి అమ్మవారికి కోర్టు ఐపీ నోటీసులు
రిపోర్టర్: సతీష్
స్థలం: Anantapur
అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి అప్పుల నుంచి బయటపడేందుకు కోర్టు ద్వారా చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి ఏకంగా ఐపీ నోటీసులు పంపినట్లు భక్తులు తెలిపారు. చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు కోటీ ఎనభై లక్షల రూపాయల అప్పులు చేసిన మోహన్, ఆలయ కమిటీకి చెల్లించాల్సిన ఏడు లక్షల రూపాయల కోసం ఈ విచిత్ర చర్యకు పాల్పడ్డారని భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.