జూరాలకు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

రిపోర్టర్: మహేష్ స్థలం: మహబూబ్ నగర్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ఫోన్ లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు కింద ఎండిపోతున్న పంటలను కాపాడటానికి తక్షణమే 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ప్రత్యేక బృందం బెంగళూరుకు బయలుదేరి వెళ్ళింది.