కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం మృతి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయవాడ

విజయవాడలోని తన నివాసంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. గత 45 ఏళ్లుగా కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.