మర్రిపాడులో ఘనంగా ఉపాధ్యాయుల వీడ్కోలు మరియు సన్మాన వేడుక
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండలంలోని కదిరినాయుడుపల్లి క్లస్టర్ పరిధిలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు దొంతు రత్నయ్య, ఉత్తమ అవార్డు గ్రహీత మున్నెల్లి రవి, బదిలీపై వెళ్తున్న బద్దల అయ్యవారయ్యలను ఘనంగా సత్కరించారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు రవీంద్ర మాట్లాడుతూ విద్యాభివృద్ధికి వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు తిరుపతయ్య, ధనలక్ష్మి సహా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందించారు.