పదిహేను రోజుల్లో పట్టణాల రూపురేఖలు మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశం

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో రానున్న పదిహేను రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి సంపూర్ణ పరిశుభ్రత సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రైనేజీ మురుగునీటి నిల్వలు తొలగించాలని, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.