కొండూరి మల్లేష్ గౌడ్ను సన్మానించిన వెంకిర్యాల గౌడ సంఘం సభ్యులు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా కొండూరి మల్లేష్ గౌడ్ ఇటీవల ఎన్నికైన సందర్భంగా వారిని బుధవారం రోజున బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు గోడల్ల బాలరాజు గౌడ్ మరియు సంఘం సభ్యులు కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి మెరుగు మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.