ఎల్నీనోతో ఎండిన పంటలకు పరిహారమిచ్చి రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ డిమాండ్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఎల్నీనో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని టీడీపీ ఆదిలాబాద్ పార్లమెంట్ యాడ్ హ్యాక్ కమిటీ సభ్యుడు పొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదం పల్లి గ్రామ శివారులో రైతులు సాగు చేసిన వరి పంటను ఆయన పరిశీలించారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తగ్గి పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.