గిరిజనులకు దక్కాల్సిన రిజర్వేషన్లపై పెల్లుబికిన పోరాట సమితి గళం
రిపోర్టర్: bhukya Narasimha rao
స్థలం: జులూరుపాడు
ఏజెన్సీ ప్రాంతాలలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో స్థానిక గిరిజన యువతకు చట్టబద్ధంగా రావాల్సిన 75 శాతం స్థానిక రిజర్వేషన్ల అమలును తక్షణమే చేపట్టాలని కోరుతూ జూలూరుపాడు మండల కేంద్రంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి విలేకరుల సమావేశం నిర్వహించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనల అమలులో లోపాల వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.