తమిళనాడులో నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారం అందించే పథకం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తమిళనాడు
తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారపు ఉంగరాన్ని బహుమతిగా అందించే తైమామ తంగ మోతిరమ్ పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ సెప్టెంబర్ 28న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయడం, సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో మాత్రం ఎన్నికల కమిషన్ అనుమతి లేకపోవడంతో ఈ పథకం అమలుకు విరామం ప్రకటించారు.