నటి దియా మీర్జా వీడియో తొలగింపుపై ముంబై మేయర్ రుతు తవడే వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Mumbai
ముంబై నగర పాలక సంస్థ విడుదల చేసిన బాణాసంచా వ్యతిరేక ప్రచార వీడియో నుండి నటి దియా మీర్జా చిత్రాలను తొలగించడంపై మేయర్ రుతు తవడే స్పందించారు. ఆ నటి ఎప్పుడూ హిందూత్వ వ్యతిరేక విధానాలను అనుసరిస్తారని, అందుకే ఆమెను వ్యతిరేకిస్తున్నామని సోమవారం మీడియాతో మాట్లాడుతూ రుతు తవడే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయానికి మతంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తూ, ప్రభుత్వ వేదికలపై ఆమె ప్రచారాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పారు.