యువ ఐపీఎస్ అధికారుల దీక్షాంత పరేడ్: సైబర్ నేరాలపై కేంద్రం హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 78వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల మొదటి దశ శిక్షణ పూర్తయినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తెలిపారు. శనివారం జరిగిన దీక్షాంత పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా యువ అధికారులు సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణా వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొని ప్రజలకు భద్రత కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.