బీఆర్ఎస్తో పొత్తు ఉండే ప్రసక్తే లేదంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమ పార్టీ, భవిష్యత్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీతో జతకట్టబోదని కిషన్రెడ్డి ఖరాఖండీగా తేల్చిచెప్పారు.