కూటమి పాలనపై జగన్‌ నిరాధార ఆరోపణలు: ఎంపీ విజయ్‌ మండిపాటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. మూడు పార్టీలది ఒకే అజెండా కావడంతో ఓర్వలేక గొడ్డలి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. డీఎస్సీపై జగన్ చేస్తున్నవి నిరాధార ఆరోపణలే. గత స్థానిక ఎన్నికల్లో నామపత్రాలు చించేసి ఉత్తరాంధ్రలో కొత్త సంస్కృతి తెచ్చారు. చర్చకు రాకుండా పారిపోతున్న జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు.