యువతకు నైపుణ్య శిక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి: నిర్మలా సీతారామన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

యువతను పరిశ్రమలకు సరిపోయే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణపై మరింత దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఫైనాన్స్ ఎక్స్ ప్రెస్ లీడర్ షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, విద్యాసంస్థల సిలబస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు, పరిశ్రమల అవసరాలకు మధ్య భారీ అంతరం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.