రాజాపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలని బీఆర్ఎస్ పిలుపు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ శుక్రవారం ప్రారంభించారు. నవంబర్ ఆరో తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షుడు ఎర్ర గోకుల జస్వంత్, లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, శ్రీకాంత్ నాయక్, బెడిద వీరేశం తదితరులు పాల్గొన్నారు.